హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీతలో భాగంగా సింగరేణి సంస్థ సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటిరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
మంగళవారం సింగరేణిభవన్‌లో సంస్థ సీఎండీ ఎన్ బలరాం సమక్షంలో ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించేందుకు ఇరుపక్షాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశా యి. ఈ ఒప్పందంలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లోని షెల్, మట్టి, శాండ్‌స్టోన్, గ్రానైట్‌రాళ్లు, బొగ్గు ఫ్లైయాష్, బాటమ్యాష్లతో నిక్షిప్తమైన కీలక ఖనిజాలను వెలికితీయనున్నారు.