హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ హోదాలో సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉంటూ సంస్థ అభివృద్ధికి సహకరించారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.