Singareni | జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి లక్ష్యం అంచనాలకు చేరుకోలేకపోయింది. గత నెలకుగాను 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి దీంట్లో 83 శాతం సాధించింది. ముఖ్యంగా ఇల్లందు ఏరియా ముందంజలో ఉండగా, బెల్లంపల్లి ఏరియా వెనుకబడింది. కొత్తగూడెం ఏరియాలో 9,96,502 టన్నుల లక్ష్యం అధిగమించి 9,93, 318 టన్నులు ఉత్పత్తి చేసింది.
అలాగే ఇల్లందు ఏరియాలో 3,29,200 టన్నులు (127 శాతం), మణుగూరు ఏరియాలో 5,34, 316 (67 శాతం), బెల్లంపల్లి ఏరియాలో 1,15,452 (48 శాతం), మందమర్రిలో 1,90, 008 (76 శాతం), శ్రీరాంపూర్ ఏరియాలో 2,68, 817 (59 శాతం), ఆర్జీ-1లో 2,90,647 (79 శాతం), ఆర్జీ-2 ఏరియాలో 4,40,009 (92 శాతం), ఆర్జీ-3 ఏరియాలో 4,14,520 (99 శాతం) బొగ్గు ఉత్పత్తి జరిగింది.
అరబిందో విస్తరణ!
హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఆర్అండ్డీని మరింత బలోపేతం చేయడంతోపాటు నిర్మాణ దశలో ఉన్న ఆరు కొత్త ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని ప్రకటించింది. ఇప్పటికే సంస్థకు 29 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, వీటిద్వారా ప్రతియేటా 50 బిలియన్ల ఔషధాలన ఉత్పత్తి చేస్తున్నది.