Mercedes-Benz | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ అంటే గతంలో సంపన్నులు మాత్రమే కొనే వారు.. కానీ ఇటీవలి కాలంలో ఆ సంస్థ కార్లకు గిరాకీ పెరిగింది. గత ఐదేండ్లలో మెర్సిడెజ్ బెంజ్ కార్ల సేల్స్ దాదాపు రెట్టింపయ్యాయి. టాప్ ఎండ్ కార్ల ధరలు రూ.1.5 కోట్లు.. ఈ సెగ్మెంట్ కార్ల విక్రయాలు 2018లో 12 శాతం ఉంటే, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 25 శాతానికి దూసుకెళ్లాయి. అంతే కాదు టాప్ హై ఎండ్ కార్ల సేల్స్ గత ఆరు నెలల్లో 54 శాతం పెరిగి 2000 యూనిట్లకు చేరాయి. భారత్లో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు టాప్ హై ఎండ్ కార్లలో ఒకటి మెర్సిడెజ్-బెంజ్ నిలిచింది. దీంతో మెర్సిడెజ్-బెంజ్ ఇండియా దాదాపు రూ.3000 కోట్ల ఆదాయం సంపాదించింది.
2023 తొలి ఆరు నెలల్లో మొత్తం మెర్సిడెజ్-బెంజ్ ఇండియా కార్లు 8528 యూనిట్లు జరిగాయి. 2022తో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ఇటీవలి కాలంలో అమ్ముడైన మోడల్ కార్లలో జీఎల్ఎస్, ఎస్ క్లాస్, ఎస్-క్లాస్ మేబాక్, జీఎల్ఎస్ మేబాక్, ఏఎంజీస్, ఈక్యూఎస్ కార్లు వీటిల్లో ఉన్నాయి.
మెర్సిడెజ్-బెంజ్ ఇండియా మొత్తం దేశీయ మార్కెట్లో 22 కార్లు విక్రయిస్తుండగా, వాటిల్లో 10 టాప్ ఎండ్ కార్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల మధ్య పలుకుతున్నాయి. ఇప్పటికీ 3500 కార్ల బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి.