Stocks Bear | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంబంలో 800 పాయింట్ల వరకు పతనమైన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 677.70 (1.13%) పాయింట్లు కోల్పోయి 59,306.93 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 185.60 (1.04 %) పాయింట్ల పతనంతో 17,671 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనిమిది రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు సుమారు రూ.17 లక్షల కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. బీఎస్ఈ లార్జ్ క్యాప్ 0.88 % కోల్పోగా, మిడ్ క్యాప్ లాభాలతో ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నష్టంతోనే ముగిసింది.
మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో కేవలం 9 స్క్రిప్ట్‌లు లాభాలు పొందితే, 21 స్టాక్స్‌లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ షేర్లు 2.38 శాతం నష్టంతో రూ.2538 వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.16.09 లక్షల కోట్ల వద్ద నిలిచింది. అలాగే కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ రెండు శాతం నష్టపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ షేర్ 7.85 శాతం పతనంతో రూ.845.65 వద్ద స్థిర పడింది.
శుక్రవారం ట్రేడింగ్‌లో మారుతి, బజాజ్ ఆటో, నెస్ట్లే, ఎస్బీఐ, కెనరాబ్యాక్, ఆల్ట్రా టెక్, డాక్టర్ రెడ్డీస్ షేర్స్ లబ్ధి పొందాయి. బీఎస్ఈలోని 3,399 షేర్లలో 1,727 షేర్లు లాభాలతో, 1,819 స్క్రిప్ట్‌లు నష్టాలతో ముగిసాయి. ఇక బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.259.43 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షలు పతనమైంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్క్రిప్ట్‌లు మార్కెట్లో నష్టాలకు కారణంగా నిలిచినా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి పుంజుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 150 పాయింట్ల నష్టంతో 59,857 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అటుపై 800 పాయింట్ల పతనంతో 59,104 పాయింట్లకు చేరుకున్నది. గురువారం సెన్సెక్స్ 59,984 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 228 పాయింట్ల పతనంతో 17,628 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్