న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశీయ మార్కెట్లోకి కొత్త విమానయాన సంస్థ రాబోతున్నది. త్వరలో శంఖ్ ఎయిర్ విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఇందు కోసం శంఖ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతులు కూడా లభించాయి. మూడేండ్ల కాలపరిమితితో ఈ ఎయిర్‌లైన్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను జారీ చేశారు.
సెబీ, ఎఫ్‌డీఐ నిబంధనల్ని పాటించాలని కూడా స్పష్టం చేసింది. అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి క్లియరెన్స్‌లు రావాల్సి ఉన్నది. ఇది వస్తే శంఖ్ ఎయిర్ విమానాలు ఎగురుతాయి. కాగా, తొలి విమాన సర్వీసు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభం కానున్నది. లక్నో, నోయిడాలు కేంద్రంగా ఇది విమానయాన కార్యకలాపాలు నడుపనున్నది.