Shamshabad Airport | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): శంషాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరోసారి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవల్-1 అక్రిడిటేషన్ ఇచ్చింది. ఎయిర్పోర్టు కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్లో పాటించే పద్దతులను పరిశీలించి ఈ గుర్తింపునిచ్చింది.
లెవల్-1 గుర్తింపునకు ఉద్యోగులు, ప్రయాణికులు, వినియోగదారుల అనుభవాలను పరిశీలించి అవసరమైన వాటిలో మెరుగుపరిచే చర్యలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ ఇస్తున్నారని జీఎమ్మార్ ఎయిర్పోర్టు నిర్వహకులు వెల్లడించారు.