Infosys-TCS | గతవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 స్టాక్స్‌లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,224.82 కోట్లు పెరిగింది. ఐటీ మేజర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ గతవారం 360.81 (0.60శాతం) పాయింట్లు లాభ పడింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లబ్ధి పొందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ నష్టాలతో ముగిశాయి.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,349.81 కోట్లు వృద్ధి చెంది రూ.12,34,637.11 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.22,997.16 కోట్ల లబ్ధితో రూ.6,32,684.95 కోట్లకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి ఇన్ఫోసిస్ 13.4 శాతం నికర లాభం పెంచుకున్నది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,514.42 కోట్ల వృద్ధితో రూ.6,16,004.09 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.4,904.87 కోట్లు లబ్ధి చెంది రూ.4,78,922.89 కోట్ల వద్ద ముగిసింది. భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,668.5 కోట్ల అభివృద్ధితో రూ.4,50,782.59 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.3,624.89 కోట్లు పెరిగి రూ.8,92,754.89 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 2,165.17 కోట్ల వృద్ధితో రూ.6,09,305.82 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,290.7 కోట్లు కోల్పోయి రూ.16,69,280.55 కోట్ల వద్ద సరిపెట్టుకున్నది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.17,373.86 కోట్లు నష్టపోయి రూ.4,25,982.59 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ స్టేట్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.490.85 కోట్లు కోల్పోయి రూ.5,35,521.33 కోట్లకు చేరుకున్నది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, భారతీ ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.