లులు ఆగయా
హైదరాబాద్‌లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, లులు గ్రూపు సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ ప్రారంభించనున్నారు.
- రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో మాల్ ఏర్పాటు
- మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోనే భారీ పెట్టుబడులు
- లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఈడీ ఎంఏ అష్రఫ్‌అలీ
- మాల్‌ను నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26(కేపీహెచ్‌బీ కాలనీ): హైదరాబాద్‌లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, లులు గ్రూపు సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ ప్రారంభించనున్నారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఏ అశ్రఫ్ అలీ మాట్లాడుతూ…గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా లులు గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక చర్చలు జరిగి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో రూ.500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని, దీంట్లో భాగంగానే రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో మొట్టమొదటి మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర గ్లోబల్ నగరాలకు పోటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కేటీఆర్ ప్రోత్సాహం వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలంగాణలో సుస్థిరమైన పాలన, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభిస్తుండటం కూడా ప్రధాన కారణమన్నారు.

హైదరాబాద్ గ్లోబల్ సిటీ
అంతర్జాతీయ నగరంగాహైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, లులు గ్రూపు సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ అవతరించింది. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో ఇతర గ్లోబల్ నగరాలకు పోటీగా హైదరాబాద్ అన్ని రంగాల్లో రాణిస్తున్నది. తెలంగాణలో సుస్థిరమైన పరిపాలన, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు లభిస్తుండటం వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం.
– ఎంఏ అష్రఫ్ అలీ, లులు గ్రూపు
ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
చిన్న నగరాలవైపు చూపు..
ప్రస్తుతం మెట్రో నగరాలకు పరిమితమైన లులు గ్రూపు..తాజాగా చిన్న నగరాలవైపు చూస్తున్నది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పబోతున్నట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లతోపాటు ఇతర చిన్న నగరాలకు సైతం వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు అశ్రఫ్ అలీ తెలిపారు. అలాగే వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తుతో చెన్నై, అహ్మదాబాద్‌ల్లో కూడా మాల్స్ నెలకొల్పాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే రూ.200 కోట్లతో చేపల ప్రాసెసింగ్ యూనిట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లులు గ్రూప్ ఇండియా సీఈవో అండ్ డైరెక్టర్ ఎంఏ నిషాద్, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ వీ నందకుమార్, లులు గ్రూప్ ఇండియా సీవోవో రేజిత్ రాధాకృష్ణన్, లులు తెలంగాణ రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ సలీం, లులు మాల్ హైదరాబాద్ మేనేజర్ ఇజిల్ ఎరాసన్, లులు హైపర్ మార్కెట్ జనరల్ మేనేజర్ నౌషద్ కిజక్కుప్పురత్లు హాజరయ్యారు.

నగరంలో డెస్టినేషన్ షాపింగ్ మాల్
నగరంలో ఇప్పటికే మాల్‌ను ఏర్పాటు చేసిన లులు గ్రూపు..భవిష్యత్తులో ఇక్కడ డెస్టినేషన్ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ మాల్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్టు అశ్రఫ్ అలీ తెలిపారు. ఈ డెస్టినేషన్ మాల్ కోసం ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం జరిగిందన్న ఆయన..ఎక్కడ ఏర్పాటు చేసే విషయాన్ని వెల్లడించలేదు. ఇతర కంపెనీ వర్గాల ప్రకారం వనస్థాలిపురంలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని కల్పించడానికి సంస్థ కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగానే ఈ డెస్టినేషన్ మాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
లులు మాల్ విశేషాలు
- 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
- 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకం గా హైపర్ మార్కెట్‌ను నెలకొల్పింది. దీంట్లో అన్ని రకాల గృహోపకరణాలు లభించనున్నాయి.
- 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో షాపింగ్ కేంద్రాలు
- 1,400 సీటింగ్ కెపాసిటీ కలిగిన 5 సినిమా స్క్రీన్లు, మల్టీ క్యూసిన్ ఫుడ్‌కోర్టులు కూడా..
- వెయ్యి కార్లు, 900 బైకుల పార్కింగ్ సదుపాయం
- దీంతో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
- ఈ మాల్లో పనిచేస్తున్న వారిలో 80-85 శాతం మంది స్థానికులే కావడం గమనార్హం.
- దేశంలో సంస్థ ఏర్పాటు చేసిన ఆరో అతిపెద్ద మాల్ ఇదే కావడం విశేషం. అలాగే తొమ్మిదోవ హైపర్ మార్కెట్ కూడా ఇదే…
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

