న్యూఢిల్లీ, అక్టోబర్ 1: జీఎస్టీ వసూళ్లు అంచనాలకుమించి నమోదయ్యాయి. గత నెలకుగాను రూ.1.89 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది వసూలైన రూ.1.73 లక్షల కోట్లతో పోలిస్తే 9.1 శాతం అధికమవగా, అలాగే అంతక్రితం నెలలో నమోదైన దాంతో పోలిస్తే 1.5 శాతం పెరిగాయని తెలిపింది.
దీంట్లో దేశీయంగా జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 6.8 శాతం ఎగబాకి రూ.1.36 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను వసూళ్లు 15.6 శాతం అధికమై రూ.52,492 కోట్లకు చేరాయి.