Stock Markets | ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై పశ్చిమాసియా దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (Banking), రియల్టీ (Realty), ఆటో స్టాక్స్ (Auto stocks) లో భారీగా నష్టాలు నమోదయ్యాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (Banking), రియల్టీ (Realty), ఆటో స్టాక్స్ (Auto stocks) లో భారీగా నష్టాలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 561.46 పాయింట్లు నష్టపోయి 77,054.94 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 159 పాయింట్లు క్షీణించి 24,052.05 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. కొన్ని రక్షణాత్మక రంగాల షేర్లు నిలదొక్కుకున్నప్పటికీ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి దారితీసింది. నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు ఎక్కువగా నష్టపోయి సూచీపై భారం మోపాయి. ఈ బలహీనత బ్రాడర్ మార్కెట్లకు కూడా విస్తరించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.01 శాతం మేర నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అయితే ఈ ప్రతికూల ధోరణికి భిన్నంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లాభాలతో ముగిసింది. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఫార్మా వంటి సురక్షిత రంగాల వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

