Sensex | ముంబై, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. వరుసగా రెండురోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు దన్నుగా నిలిచాయి. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపగడంతో సూచీలు లాభాల్లోకి వచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 367.47 పాయింట్లు లాభపడి 66,527.67 వద్ద ముగిసింది. చమురు, ఐటీ, మెటల్ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్లలో 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 107.75 పాయింట్లు అందుకొని 19,753.80 వద్ద స్థిరపడింది.