Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. తొలిసారిగా సెన్సెక్స్ 82వేల, నిఫ్టీ 25వేల మార్క్‌ను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,949.68 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే 300 పాయింట్లకుపైగా పెరిగింది. 82,129.49 పాయింట్లకు పెరిగిన జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 25,078.30 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం సెన్సెక్స్ 150.24 పాయింట్ల లాభంతో 81891.58 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.
నిఫ్టీ 72.15 పాయింట్లు పెరిగి.. 25023.30 వద్ద కొనసాగుతున్నది. చిప్ కంపెనీల ర్యాలీకి తోడు వడ్డీరేట్ల కోతలపై ఫెడ్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.3,462 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,366 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. ట్రేడింగ్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, మారుతి సుజూకీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్, హిందాల్కో, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.