ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 714.53 పాయింట్లు కోల్పోయి 57,197.15, నిఫ్టీ 220.60 పాయింట్లు క్షీణించి 17,172 వద్ద ట్రేడింగ్ ముగిసింది. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు వెనుకపడిపోగా.. అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, మారుతీ సుజుకీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దలాల్ స్ట్రీట్ మొత్తం ఈ వారం రోలర్ కోస్టర్లా రైడ్‌లా.. పడుతూ లేస్తూ సాగిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. సోమవారం నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. మంగళవారం సైతం 1.73శాతం నష్టపోయాయి. ఈ వారం చివరి రోజు ట్రేడింగ్ సెన్సెక్స్ 1.96 శాతం నష్టంతో ముగిసి, 57197.15 వద్ద, నిఫ్టీ 1.74శాతం నష్టంతో 17,171.95 వద్ద ట్రేడింగ్ ముగిశాయి.