సూచీలకు చమురు కిక్కు.. 940 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పతనం చెందడం పెట్టుబడిదారుల్లో జోష్‌ను పెంచింది.
ముంబై, మే 6 : దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పతనం చెందడం పెట్టుబడిదారుల్లో జోష్‌ను పెంచింది. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలకు చివర్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మరో మెట్టుపైకి ఎక్కించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా బలపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం బలపడి 77,958.52 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం అందుకొని 24,330.95 పాయింట్లకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లు అంచనాలకుమించి రాణించడం వల్లనే సూచీలు భారీగా పెరిగాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు చరమగీతం పాడటానికి అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉండటం, అలాగే క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీల్లో ర్యాలీకి దోహదం చేసిందని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
- ఇండిగో షేరు 6.60 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, టాటా స్టీల్ షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
- వీటితోపాటు సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, అదానీపోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, బీఈఎల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, రిలయన్స్ షేరు 1.80 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది.
- ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, టైటాన్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
- రంగాలవారీగా టెలికాం సూచీ 2.94 శాతం బలపడగా, సర్వీసెస్ 2.89 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్ 2.81 శాతం, రియల్టీ 2.76 శాతం, బ్యాంకింగ్ 2.64 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.47 శాతం, హెల్త్‌కేర్ 1.99 శాతం చొప్పున ఎగబాకాయి.
- మరోవైపు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ రంగ షేర్లు పతనం చెందాయి.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 10 శాతం తగ్గి 100 డాలర్ల దిగువకు పడిపోయింది.
చమురు, పెయింటింగ్ షేర్లలో ర్యాలీ
చమురు ధరలు కుదేలు కావడంతో చమురు రంగ షేర్లతోపాటు పెయింటింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోవడం ప్రభుత్వరంగ చమురు సంస్థలకు అధిక లాభం చేకూరనుండటంతో వీటి షేర్లు కదంతొక్కాయి. దీంతో హెచ్‌పీసీఎల్ షేరు 6.89 శాతం బలపడగా, బీపీసీఎల్ షేరు 5.12 శాతం, ఐవోసీ షేరు కూడా 4.22 శాతం ఎగబాకింది.
69 పైసలు పెరిగిన రూపాయి
రూపాయి విలువ మళ్లీ పుంజుకుంటున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 69 పైసలు ఎగబాకి 94.49కి ఎగబాకింది. క్రూడాయిల్ దిగిరావడంతో అమెరికా కరెన్సీ తీవ్ర ఆటుపోటులకు గురైందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 95 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 95.18 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 69 పైసలు అందుకొని 94.49కి చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

