Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్మొదటిసారి 85,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై, తరువాత క్రమంగా లాభాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను భవిష్యత్తులోనూ తగ్గించే అవకాశాలుండటం, ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడవడంతో సెన్సెక్స్ మరో మైలురాయి 85 వేలు దాటింది. ఎనర్జీ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ముగియడం కలిసొచ్చింది. మంగళవారం ఉదయం 10:05 గంటల సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 80.74 పాయింట్లు పెరిగి 85,009.35 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ50 సూచీ 29.15 పాయింట్లు వృద్ధి చెంది 25,968.20 వద్ద కొనసాగుతోంది.
గత సెషన్లో 84,928.61 దగ్గర క్లోజ్ అయిన సెన్సెక్స్, ఈ రోజు ప్రారంభంలో దాదాపు 67 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,860.73 దగ్గర ఓపెన్ అయింది. సోమవారం 25,939 దగ్గర ఆగిన నిఫ్టీ, ఈ రోజు 18 పాయింట్లు తగ్గి 25,921.45 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 84,853 వద్దకు చేరింది. నిఫ్టీ50 సూచీ 10 పాయింట్లు కుంగి 25,930 వద్ద ట్రేడైంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి.
మూడు రోజుల్లో 8.30 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పుంజుకుంటుండటంతో గత 3 రోజుల్లో మదుపరుల సంప ద రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4,76,03,923.17 కోట్లకు చేరింది. రూ.1.8 లక్షల కోట్ల నష్టం.
Also Read..
F & O Trading | రూ.1.8 లక్షల కోట్ల నష్టం.. ఎఫ్అండ్వో ట్రేడింగ్లో నష్టపుటేరులు
Reliance Jio | జియో సరికొత్త ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ 5జీ డాటా