Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ స్టాక్‌లలో లాభాల మద్దతుతో రెండు సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సూచీలు సెన్సెక్స్ 77,529.19 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 78,164.71 పాయింట్ల గరిష్ఠానికి చేరి జీవితకాల గరిష్ఠానికి చేరింది. చివరకు 712.45 పాయింట్లు లాభపడి.. 78,053.52 వద్ద లాభాల్లో ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్ గరిష్ఠానికి పెరిగింది.
183.45 పాయింట్లు పెరిగి.. 23,721.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, లార్సెన్, విప్రో, ఎస్బీఐ, బ్రిటానియా, విప్రో భారీగా లాభపడ్డాయి. బీపీసీఎల్, ఐచర్ మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటాస్టీల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బబాజ్ ఆటో నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 902.05 పాయింట్లు పెరిగి 52,606 వద్ద స్థిరపడింది. ఇతర రంగాల సూచీల కంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ స్టాక్‌లు లాభాల్లో కొనసాగగా.. మెటల్, రియల్టీ స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.