Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నది. ఫలితంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 75,672.84 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 75,794.15 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 75,463.01 పాయింట్లకు పతనమైంది. చివరకు 203.22 పాయింట్ల నష్టంతో 75,735.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 19.75 పాయింట్లు తగ్గి.. 22,913.15 వద్ద స్థిరపడింది.
నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్ నష్టాలను చవిచూశాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే ఆటో, మెటల్, ఆయిల్, గ్యాస్, మీడియా, పవర్, రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్ ఒకటి నుంచి రెండుశాతం వరకు, బ్యాంక్ ఇండెక్స్ 0.5శాతం వరకు పతనమయ్యాయి. నాట్కో ఫార్మా, కిర్లోస్కర్ ఆయిల్, ఐటీసీ, కజారియా సిరామిక్, సెరా శానిటరీ, బిర్లాసాఫ్ట్, గ్రైండ్‌వెల్ నార్టన్‌తో సహా 150కి పైగా స్టాక్‌లు బీఎస్ఇలో 52 వారాల కనిష్ఠానికి చేరుకున్నాయి.