Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో వాణిజ్య యుద్ధం భయాల మధ్య మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలతో మార్కెట్లు.. దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో మొదలయ్యాయి. కిందటి సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 73,424.92 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 74,859.39 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది.
చివరకు 1,089.18 పాయింట్లు లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నిఫ్టీ 374.25 పాయింట్లు పెరిగి 22,535.85 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,968 షేర్లు లాభపడ్డాయి. మరో 843 షేర్లు పతనం కాగా.. మరో 115 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, సిప్లా, భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ నష్టపోయింది. క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, రియాల్టీ, టెలికాం, మీడియా రెండు నుంచి 4శాతం వరకు పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండుశాతం వరకు పెరిగాయి.