Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త శిఖరాలను అందుకున్నాయి. వరుసగా మూడోరోజు మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. ఉదయం ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటిక సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. చివరకు మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దాంతో స్వల్ప లాభాలతో మంగళవారం మార్కెట్లు ముగిశాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,731.49 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత అదే దూడుకును కొనసాగిస్తూ సెన్సెక్స్ 80,898.30 పాయింట్లకు ఎగిసి జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరి సమయంలో మదుపరులు లాభాలకు దిగడంతో స్వల్పంగా తగ్గింది. 80,598.06 పాయింట్లకు తగ్గి.. మళ్లీ కోలుకున్నది.
చివరకు 51.69 పాయింట్ల లాభంతో 80,716.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగించింది. కిందటి సెషన్‌తో పోలిస్తే నిఫ్టీ 24,615.90 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. కొద్ది సమయంలో 24,661.25 పాయింట్లకు పెరిగి.. ఆల్‌టైమ్ హైకి చేరుకున్నది. చివరకు 26.30 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం లాభాల్లో ముగిశాయి. శ్రీరాం ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హిందాల్కో, రిలయన్స్, హీరో మోటోకార్ప్, సిప్లా నష్టాల్లో ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో పయనించగా.. బ్యాంకు షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా కోల్ ఇండియా షేర్లు 3శాతం, ఎయిర్ ఇండియా షేర్లు 2శాతం వృద్ధిని నమోదు చేశాయి.