Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇటీవల సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న బెంచ్ మార్క్ సూచీలు మరోసారి కొత్త రికార్డులను నమోదు చేశాయి. సూచీలు ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. చివరి సెషన్లో ఆటో, మెటల్ షేర్ల మద్దతుతో జీవితకాల గరిష్ఠాలను తాకాయి. క్రితం పోలిస్తే సెన్సెక్స్ గురువారం ఉదయం 85,167.56 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 85,106.74 పాయింట్ల కనిష్ఠానికి తగ్గిన సెన్సెక్స్.. 85,930.43 పాయింట్ల గరిష్ఠానికి చేరి 86వేల పాయింట్లకు చేరువైంది. చివరకు 666.25 పాయింట్ల లాభంతో 85,836.12 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం లాభాల భాటలో కొనసాగింది. ఇంట్రాడేలో 26,250.90 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ రికార్డు హైకి చేరింది. చివరకు 211.90 పాయింట్ల లాభంతో.. 26,216.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ లాభాల్లో కొనసాగగా.. ఓఎన్జీసీ, సిప్లా, దివిస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, ఎల్అండ్టీ నష్టపోయాయి. సెక్టార్లలో మెటల్, ఆటో 2 శాతం చొప్పున, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒకశాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.5 శాతం పతనమైంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం దిగజారింది.