Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దాంతో మార్కెట్లు పొద్దంతా నష్టాల్లోనే కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,928.12 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదైలంది. ఆ తర్వాత మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్‌లో 81,423.14 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 82,134.95 పాయింట్లను తాకింది. చివరకు 398.13 పాయింట్లు పతనమై.. 81,523.16 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 122.65 పాయింట్లు పతనమై.. 24,918.45 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 1,619 స్టాక్స్ లాభాల్లో కొనసాగగా.. 2,345 షేర్లు పతనమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, దివిస్ ల్యాబ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాటామోటార్స్, ఓఎన్‌సీజీ, విప్రో, ఎస్బీఐ, హిందాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్, లార్సెన్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీలో ఆయిల్, గ్యాస్ ఇండెక్స్ భారీగా నష్టపోయాయి. ఏకంగా రెండుశాతం తగ్గింది. పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ 1.5శాతానికిపైగా పతనమయ్యాయి. ఆటో, రియల్టీ సైతం 1.2శాతం వరకు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ 0.3శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కాకముందే మార్కెట్లు పతనమయ్యాయి. ఈ కాలంలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.47 లక్షల కోట్లు తగ్గి రూ.461.02 లక్షల కోట్లకు చేరుకుంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, హై వాల్యుయేషన్ కారణంగా వచ్చే 12 నెలల్లో భారత వాహన తయారీదారుల షేర్లు 21 శాతం పతనమయ్యే అవకాశం ఉందని యూబీఎస్ అంచనా వేసింది. గ్లోబల్ డిమాండ్ మందగించడంపై పెరుగుతున్న ఆందోళనలపై మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ డిసెంబర్ 2021 నుంచి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దాంతో చమురు, గ్యాస్ ఇండెక్స్ 1.9శాతం పతనమైంది.