Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్లో పుంజుకున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,591.03 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,106.98 పాయింట్ల కనిష్టానికి చేరిన సెస్సెక్స్.. అత్యధికంగా 81,816.89 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు 320.70 పాయింట్లు పెరిగి.. 81,633.02 వద్ద ముగిసింది. నిఫ్టీ 81.15 పాయింట్లు పెరిగి 24,833.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 1,751 షేర్లు లాభపడగా.. 1,748 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎక్స్టర్నల్, ట్రెంట్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐచర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ లాభాల్లో కొనసాగగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, భారత్ ఎలక్ట్రికల్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైన్సాన్స్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్ తదితర షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ రియాల్టీ 1.2 శాతం పెరిగింది. మెటల్ .08శాతం, ఐటీ, ఫార్మా 0.5శాతం వృద్ధిని నమోదు చేశాయి. పీఎస్‌యూ బ్యాంక్ 0.8శాతం తగ్గింది. ఎఫ్ఎంసీజీ 0.6శాతం పతనమైంది.