Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లోకి ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 341.04 పెరగ్గా.. నిఫ్టీ 111 పాయింట్లకుపైగా పెరిగింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలతో పాటు ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 73,830.03 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 73,796.06 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. 74,376.35 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది.
ఇంట్రాడేలో 500 పాయింట్లకుపైగా గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 111.55 పాయింట్లు పెరిగి.. 22,508.75 వద్ద ముగిసింది. దాదాపు 1,541 షేర్లు లాభపడగా.. 2,403 షేర్లు పతనమయ్యాయి. రంగాల వారీగా చూస్తే, ఆటో, బ్యాంక్, మెటల్, పవర్, ఫార్మా 0.5 నుంచి 1.5 శాతం పెరిగాయి. రియాలిటీ, మీడియా 0.5 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి, బ్రిటానియా, హీరో మోటోకార్ప్, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.