Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు సెషన్లలో లాభపడ్డ సూచీలు శుక్రవారం నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రపంచ మార్కెట్లలో మందగమనం నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆ తర్వాత సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్ (77,042.82)తో పోలిస్తే 77,069.19 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 77,069.19 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 76,263.29 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 423.49 పాయింట్ల నష్టంతో 76,619.33 వద్ద ముగిసింది.
నిఫ్టీ 108.60 పాయింట్లు పతనమై.. 23,203.20 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,975 షేర్లు లాభపడగా.. మరో 1,797 షేర్లు పతనమయ్యాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో నిఫ్టీలో నష్టాలను చవిచూశాయి. బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ, బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 2శాతం పతనం కాగా.. ఆయిల్, గ్యాస్, పవర్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, మెటల్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు పెరిగాయి.