Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకాలతో మార్కెట్లు లాభాల్లో మొదలవగా.. అయితే, అదానీ గ్రూప్స్, సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ సోమవారం 79,330.12 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,106.18 పాయింట్ల గరిష్ఠానికి పెరగ్గా.. సెన్సెక్స్ 79,226.13 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 56.98 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20.50 పాయింట్ల వద్ద 24,347.00 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
ట్రేడింగ్‌లో దాదాపు 1,760 షేర్లు పురోగమించగా.. 1,801 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్జీసీ, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో కొనసాగాయి. ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. సెక్టార్లలో, ఎఫ్ఎంసీజీ, పవర్, సీఎస్‌యూ బ్యాంక్, మీడియారంగాల షేర్లు 0.5-2 శాతం పతనమయ్యాయి. బ్యాంక్, టెలికాం, ఐటీ, ఆయిల్, గ్యాస్, మెటల్ రియల్టీ 0.3-1 శాతం పెరిగాయి.