గురువారం 04 మార్చి 2021
Business - Jan 27, 2021 , 17:12:47

బ‌డ్జెట్‌కు ముందు బేర్‌మ‌న్న స్టాక్ మార్కెట్లు

బ‌డ్జెట్‌కు ముందు బేర్‌మ‌న్న స్టాక్ మార్కెట్లు

ముంబై: బ‌డ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు బేర్‌మ‌న్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు బుధ‌వారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో ఆ ప్ర‌భావం మన సూచీల‌పై ప‌డింది. సెన్సెక్స్ ఏకంగా 938 పాయింట్లు ప‌త‌న‌మై 47,409 పాయింట్ల‌కు చేర‌గా.. నిఫ్టీ 271 పాయింట్లు ప‌త‌న‌మై 13,967 పాయింట్ల‌కు చేరింది.

బ‌డ్జెట్‌కు ముందు ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. దీనికి ప్ర‌ధానంగా కొన్ని కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇందులో మొద‌టిది అంత‌ర్జాతీయ మార్కెట్లు బ‌ల‌హీనంగా ఉండ‌టం. ప‌్ర‌ధాన అంత‌ర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ల‌కు అనుగుణంగానే భార‌త మార్కెట్లు స్పందిస్తున్నాయి. ఇక బ‌డ్జెట్‌కు ముందు ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త ప‌డ‌టం స‌హ‌జ‌మే. గ‌త బ‌డ్జెట్‌లు మార్కెట్ల‌పై చాలా వ‌ర‌కు ప్ర‌తికూల ప్ర‌భావ‌మే చూపించాయి. ఇక గ‌త రెండు సెషన్ల‌లో విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) ఇండియ‌న్ ఈక్విటీల‌ను విక్ర‌యించారు. జ‌న‌వ‌రి 25న రూ.765.3 కోట్ల విలువైన షేర్లు, జ‌న‌వ‌రి 22న 635.69 కోట్ల విలువైన షేర్ల‌ను వాళ్లు విక్ర‌యించారు. 

VIDEOS

logo