Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 146.59 పాయింట్ల లాభంతో 59,107.19 పాయింట్లు వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కేవలం 25.30 పాయింట్ల స్వల్ప లాభంతో 17,512.25 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఐటీసీ లాభాలను నమోదు చేశాయి. ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, కోల్ ఇండియా నష్టాల్లో కొనసాగాయి. మరో వైపు ఆసియా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ, నిక్కీ లాభాల్లో కొనసాగగా.. స్ట్రెయిట్ టైమ్స్, హాంగ్‌సెంగ్ నష్టాల్లో కొనసాగాయి.