ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 02, 2021 , 01:52:38

అంబానీకి జరిమానా

అంబానీకి జరిమానా

  • ఆర్‌పీఎల్‌ షేర్ల ట్రేడింగ్‌లో 
  • అక్రమాలపై సెబీ కొరడా

న్యూఢిల్లీ, జనవరి 1: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీతోపాటు మరో రెండు సంస్థలపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) శుక్రవారం కొరడా ఝళిపించింది. 2007 నవంబర్‌లో రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (ఆర్‌పీఎల్‌) షేర్ల ట్రేడింగ్‌ సందర్భంగా అక్రమాలు జరిగాయన్న అభియోగాలతో ఆర్‌ఐఎల్‌కు రూ.25 కోట్లు, అంబానీకి రూ.15 కోట్లు జరిమానా విధించింది. అలాగే నవీ ముంబై సెజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.20 కోట్లు, ముంబై సెజ్‌ లిమిటెడ్‌ను రూ.10 కోట్లు పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది.

VIDEOS

logo