న్యూఢిల్లీ, మార్చి 13: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాటాల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్ల నిధులను సేకరించాలని సంస్థ భావిస్తున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోయే దక్షిణ కొరియాకు చెందిన రెండో సంస్థ ఎల్జీ కానుండటం విశేషం.
ఇప్పటికే గతేడాది హ్యుందాయ్ మోటర్ స్టాక్ మార్కెట్లో లిైస్టెన విషయం తెలిసిందే. 15 శాతానికి సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించే ప్రతిపాదనపై గతేడాది సెబీకి ఎల్జీ దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం సెబీ నుంచి అనుమతిపొందినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఐపీవో వివరాలు వెల్లడించకపోయినప్పటికీ రూ.15 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గతేడాదికిగాను రూ. 64,087 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.