ఐదు ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్
దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐదు సంస్థలు అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఓయో అనుబంధ సంస్థయైన ప్రిస్మ్, వార్బర్గ్ పింకస్‌కు చెందిన తృహోమ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్ వీగాలాండ్ డెవలపర్స్‌తోపాటు మరో రెండు సంస్థల ఐపీవోకి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐదు సంస్థలు అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఓయో అనుబంధ సంస్థయైన ప్రిస్మ్, వార్బర్గ్ పింకస్‌కు చెందిన తృహోమ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్ వీగాలాండ్ డెవలపర్స్‌తోపాటు మరో రెండు సంస్థల ఐపీవోకి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మిగతా రెండు సంస్థల్లో అగ్రికల్చరల్ సొల్యూషన్స్ కంపెనీ అడ్వాంటా ఎంటర్ప్రైజెస్, మెహతా హైటెక్ ఇండస్ట్రీస్ ఉన్నట్టు సెబీ పేర్కొంది. ఈ నెల 1 నుంచి ఐదు లోపల ఆయా సంస్థలు దాఖలు చేసిన దరఖాస్తులపై కులంకుషకంగా చర్చించిన తర్వాత అనుమతినిచ్చినట్టు సెబీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు చేసుకున్న ఐదు కంపెనీలు మొత్తంగా రూ.10 వేల కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయి. వీటిలో ఓయోకు చెందిన ప్రిస్మ్ అత్యధికంగా రూ.6,650 కోట్ల వరకు నిధులు సమీకరించనుండగా, తృహోమ్ ఫైనాన్స్ రూ.1,500 కోట్లు, వేగాల్యాండ్ డెవలపర్స్ రూ.250 కోట్లు నిధులు సేకరించనున్నాయి.
సీఎమ్మార్ గ్రీన్‌టెక్‌కు అపూర్వ స్పందన
సీఎమ్మార్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 127 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లు, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా కొనుగోళ్లు జరిపారు. రూ.631 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 2,30,43,930 షేర్లను జారీ చేయగా..2,92,75,44,594 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

