ఐపీవో అప్రూవల్ చెల్లుబాటు గడువు పెంపు
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలని చూస్తున్న కంపెనీలకు గొప్ప ఊరట దక్కింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అప్రూవల్స్కున్న చెల్లుబాటు గడువును పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకా పొడిగిస్తున్నట్టు మంగళవారం పేర్కొన్నది.
- గల్ఫ్ ఉద్రిక్తతల దృష్ట్యా సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలని చూస్తున్న కంపెనీలకు గొప్ప ఊరట దక్కింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అప్రూవల్స్కున్న చెల్లుబాటు గడువును పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకా పొడిగిస్తున్నట్టు మంగళవారం పేర్కొన్నది. అలాగే కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలకు వన్-టైం సడలింపును కూడా ఇచ్చింది. మార్కెట్లో ప్రస్తుతమున్న ఒడిదుడుకులతో చాలా సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సందేహిస్తున్నాయి. సూచీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నది చూస్తూనే ఉన్నాం.
దీంతో ఈ సమయంలో నిధుల సమీకరణ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలివ్వదని చాలా సంస్థలు తమ ఐపీవో ప్రణాళికల్ని వాయిదా వేయాలనుకుంటున్నాయి. అయితే దరఖాస్తుల్ని పరిశీలించిన సెబీ ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గడువు తీరిపోతుందేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఐపీవో అప్రూవల్స్ గడువు తీరిపోతున్న కంపెనీలకు సెప్టెంబర్ 30దాకా ఐపీవోకు వెళ్లే అవకాశం ఉంటుందని సెబీ చెప్పింది. అంతేగాక ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థలు.. ఏప్రిల్ 1-సెప్టెంబర్ 30 మధ్య ఎంపీఎస్ నిబంధనల్ని పాటించాలన్న డెడ్లైన్నూ సడలించింది. ఎలాంటి జరిమానాలు ఉండబోవన్నది. కరోనా వైరస్ సమయంలోనూ సెబీ ఇలాంటి సడలింపే ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

