హైదరాబాద్, మే 25: స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్‌లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ 115 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనదేశంలో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నది. హైదరాబాద్, బెంగుళూరుల్లో స్మార్ట్ ప్లాంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ష్నైడర్ ప్రపంచవ్యాప్త ఎగుమతుల్లో సగం భారత్ నుంచే జరుగుతున్నాయి.ఫ్రాన్స్, బోస్టన్ (యూఎస్), చైనాల తర్వాత భారత్ ఇప్పుడు ష్నైడర్‌కు ఇంటర్నేషనల్ హబ్‌గా ఉంది.