హైదరాబాద్, జూలై 1 : ఎస్బీఐ.. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతాలో గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో కొత్తగా 800 మంది ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
దేశీయ వాణిజ్యాన్ని, దిగుమతి-ఎగుమతి లావాదేవీల ప్రాసెసింగ్‌ను క్రమబద్దీకరించడం, వేగవంతమైన టర్న్‌రౌండ్, గణనీయమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి వీలు పడనున్నదని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.