SBI Platinum Diposits offer | సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ప్లాటినం ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ఈ ఆఫర్లు లభిస్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చిన డిపాజిట్ల పథకానికి ప్లాటినం డిపాజిట్ల స్కీం అని పేరు పెట్టింది. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించింది. సదరు డిపాజిట్లపై అదనపు వడ్డీరేట్లు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లపై 0.15 శాతం వడ్డీ అదనంగా కల్పిస్తోంది ఎస్బీఐ. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల గడువుతో ఈ ప్లాటినం డిపాజిట్లు స్వీకరిస్తారు. వ్యక్తులు 75 రోజులు, 525 రోజులు, 2250 రోజుల గడువుతో డిపాజిట్లు కూడా చేయొచ్చు.
ఈ స్కీం కింద రూ.2 కోట్ల లోపు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో టర్మ్ డిపాజిట్లను అనుమతిస్తారు. ఎన్ఆర్ఈ డిపాజిట్లు కేవలం 525 రోజులు, 2250 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. న్యూ డిపాజిట్లతోపాటు ఇప్పటికే చేసిన డిపాజిట్ల రెన్యూవల్‌కు కూడా ఈ స్కీం రూల్స్ అమలవుతాయి. టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.
రికరింగ్ డిపాజిట్లు, టాక్స్ సేవింగ్ డిపాజిట్లు, యాన్యూటీ డిపాజిట్లు, మకాడ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్లు, క్యాపిటల్ గెయిన్ స్కీమ్స్‌కు ఈ ఆఫర్లు వర్తించవు.
75 రోజుల టెన్యూర్ గల ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లపై ప్రస్తుతం 3.90 శాతం వడ్డీరేటు లభిస్తుంది. స్పెషల్ ఆఫర్ కింద 3.95 శాతం వడ్డీ వర్తిస్తుంది.
525 రోజుల గడువు గల డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు శాతం వడ్డీకి బదులు 5.10 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇక 2250 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 5.40 శాతానికి బదులు 5.55 శాతం వడ్డీ అందిస్తుంది ఎస్బీఐ.
సీనియర్ సిటిజన్లు 75 రోజుల గడువుతో చేసే టర్మ్ డిపాజిట్లపై 4.40 శాతం నుంచి 4.45 శాతానికి వడ్డీ పెంచారు. 525 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే, 2250 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై అదనపు వడ్డీ ఇవ్వరు. ఈ డిపాజిట్లపై వడ్డీరేట్లు నెలవారీగా, త్రైమాసికం ప్రాతిపదికన చెల్లిస్తారు. మెచ్యూర్ అయిన తర్వాత ఈ డిపాజిట్ల మొత్తం చెల్లిస్తారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన