ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త విధానాలను, సౌకర్యాలను తెస్తూ ఉంటుంది. తాజాగా మదుపరుల కోసం తీ-ఇన్-వన్ ఖాతాను పరిచయం చేసింది. సేవింగ్స్, డీమ్యాట్, ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ల కలయికే ఇది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తప్పనిసరి. ఇటీవలికాలంలో స్టాక్స్‌పై పెట్టుబడులకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూలు (ఐపీవో) పెద్ద ఎత్తున వస్తుండగా, లాభాల మోత మోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ త్రీ-ఇన్-వన్ ఖాతాను ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా సరళంగా, పేపర్ రహిత ట్రేడింగ్ అనుభవాన్ని ఖాతాదారులు పొందవచ్చని బ్యాంక్ చెప్తున్నది.
ఈ-మార్జిన్ సౌకర్యంతో..
ట్రేడర్లను దృష్టిలో పెట్టుకొని త్రీ-ఇన్-వన్ ఖాతాకు ఈ-మార్జిన్ సౌకర్యాన్నీ కల్పించారు. ఈ విధానంలో 25% కనిష్ఠ మార్జిన్లతో ఖాతాదారులు ట్రేడింగ్ చేసుకోవచ్చు. కోరుకున్న మార్జిన్‌ను పొందడానికి నగదు లేదా పూచీకత్తు ద్వారా 30 రోజులదాకా తమ పొజీషన్లనూ ముందుకు తీసుకెళ్లవచ్చు. మార్జిన్‌ను నగదు లేదా స్టాక్స్ రూపంలో అందుకునే వీలున్నది. అలాగే డీమ్యాట్ ఖాతాలోని స్టాక్స్‌ను డెలివరీగా మార్చుకోవచ్చు. లేదా గడువు తేదీలోగా స్కేర్ ఆఫ్కూ అవకాశం ఉంటుందని తమ వెబ్సైట్లో ఎస్బీఐ పేర్కొన్నది.
ఖాతా తెరిచేందుకు కావాల్సినవి
ఖాతా ఎలా తెరవాలి?