Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది. మంగళవారం విడుదల చేసిన కొత్త ప్రాక్సీ ఫైలింగ్ ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం పెరిగి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ.847.31 కోట్లు అన్నమాట. బాధ్యతలు చేపట్టిన గత పదేళ్లలో ఇదే అత్యధిక వేతనం. కృత్రిమ మేధస్సులో కంపెనీ పురోగతికిగాను నాదెళ్లకు ఈ ప్రోత్సాహం అందనుంది.
కాగా, గతేడాది ఆయన జీతం 79.1 మిలియన్ డాలర్లుగా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.664 కోట్లు. 2023లో అందుకున్న 48.5 మిలియన్ డాలర్లతో పోల్చితే ఇది 63 శాతం ఎక్కువ. సత్య నాదెళ్ల వేతనంలో ఎక్కువ భాగం 84 మిలియన్ డాలర్లకు పైగా విలువైన స్టాక్ అవార్డుల రూపంలో లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ పొందిన లభాలకు గాను ఆయన 9.5 మిలియన్ డాలర్లకు పైగా నగదు ప్రోత్సాహకాలను కూడా అందుకున్నారు. ఏఐ విప్లవంతో గత మూడేళ్లలో మైక్రోసాఫ్ట్ షేర్లు విలువ రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగాయి.
Also Read..
PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
Gold Rates | గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు