SAP : జర్మనీకి చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఫోకస్ పెంచడంతో 8000 ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకం కానుంది. రూ. 18,000 కోట్ల పెట్టుబడులతో భవిష్యత్ వృద్ధి కోసం శాప్ డైనమిక్ టెక్ ల్యాండ్‌స్కేప్‌పై వెచ్చించనుంది. శాప్ తదుపరి అధ్యాయంగా ఈ వ్యూహాత్మక మార్పును కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లీన్ పేర్కొన్నారు.
శాప్‌లో ప్రపంచవ్యాప్తంగా 108000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కంపెనీ ఏఐ ఫోకస్‌తో పునర్వ్యవస్ధీకరణలో దాదాపు 7 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు వైదొలగడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాల పెంపుకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మార్పులను సాఫీగా చేపట్టాలని శాప్ భావిస్తోంది. లేఆఫ్స్ ముద్ర పడకుండా కొందరు ఉద్యోగులను కంపెనీ నుంచి తప్పుకోవాలని శాప్ కోరనుంది.
శాప్ గతంలో మూడు జనరేటివ్ ఏఐ కంపెనీల్లో పెట్టుబడుల గురించి ప్రకటించింది. విప్రో, హువై వంటి కంపెనీలు సైతం ఏఐ సామర్ధ్యాలపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. కంపెనీలు ఏఐ టెక్నాలజీలో ప్రవేశించడం, భారీ పెట్టుబడులు వెచ్చిస్తున్న క్రమంలో శాప్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియలో వేలాది ఉద్యోగులపై వేటు పడనుండటంతో టెకీల్లో గుబులు రేగుతోంది.
Read More :
Data Leak | యూఎస్ సహా పలు దేశాలూ.. ఇంటర్నెట్ యూజర్లకు షాక్.. 26 బిలియన్ల మంది డేటాలీక్..!