న్యూఢిల్లీ, జూన్ 13: డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎంతో సామ్సంగ్ జట్టు కట్టింది. దేశీయంగా తమ సామ్సంగ్ వాలెట్‌కు ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ సర్వీసులను జత చేసేలా పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. పేటీఎం సహకారంతో ఇక సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సామ్సంగ్ వాలెట్ ద్వారా విమాన, బస్ టికెట్ల బుకింగ్, సినిమా టికెట్ కొనుగోళ్లు, ఈవెంట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. గెలాక్సీ స్టోర్ నుంచి ప్రస్తుత సామ్సంగ్ వాలెట్ యూజర్లు తమ యాప్‌ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త సర్వీసులను అందుకోవచ్చు.