Samsung Galaxy M55s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) త్వరలో తన శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ (Samsung Galaxy M55s) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు రంగుల్లో, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ర్యామ్, స్టోరేజీ కెపాసిటీ వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, నో షేక్ క్యామ్ మోడ్ తోపాటు లో లైట్ కెమెరా ఫీచర్ల కోసం నైటోగ్రఫీకి మద్దతుగా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాలతో ఇమేజ్ లు, వీడియోలు ఒకేసారి క్యాప్చర్ చేయొచ్చు.