హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. హాల్‌టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీల్లో పొందుపరిచాయని, బుధవారం రాత్రి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వచ్చే నెల 2 నుంచి 21వరకు జరిగే ఈ పరీక్షలకు సైన్స్ సబ్జెక్టుల్లో నాలుగు లక్షలు, వొకేషనల్ గ్రూపుల్లో లక్ష మంది హాజరుకానున్నారు.