Samsung Galaxy F06 5G | దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ (Samsung Galaxy F06 5G) వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు రంగుల్లో రానున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఇది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఈ-స్టోర్‌ల్లో విక్రయిస్తారు. ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటలకు దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ ఫోన్ ధర రూ.9000-9,999 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. బహమా బ్లూ, లిట్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ (Samsung Galaxy F06 5G) ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వస్తోంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.ఇంతకు ముందు దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ 6.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉన్నాయి. గతేడాది ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ రూ.7,999లకే లభిస్తుంది.