Samsung Galaxy A16 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆరేండ్ల పాటు సెక్యూరిటీ, ఆరేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందిస్తామని ఆఫర్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999 పలుకుతుంది. బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్లలో సేల్స్ జరుగుతాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 పొదుపు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది ఈ స్మార్ట్ ఫోన్. 50- మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 7.9 ఎంఎం థిక్ నెస్ కలిగి ఉంటుంది. నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్, శాంసంగ్ వాలెట్ విత్ టాప్ అండ్ పే ఫీచర్ పవర్డ్ బై ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్) ఉంటాయి. 25వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.