Sam Altman : ఆన్లైన్ సెర్చ్‌లో రెండు దశాబ్ధాలుగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా యూజర్లు గూగుల్ చేయడం సర్వసాధారణమైంది. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి ఏఐ టూల్స్ రాకతో ప్రజలు సమాచారాన్ని సేకరించే పద్ధతి మారుతుందని భావిస్తున్నారు. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌పై చాట్‌జీపీటీ క్రియేటర్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌కు పోటీ ఇవ్వాలనే ఆలోచన, గూగుల్ సెర్చ్‌కు నకలును క్రియేట్ చేయడం కిక్ ఇచ్చే ఐడియా కాదని అన్నారు.
మెరుగైన రీతిలో వేగవంతమైన సమాచారం ఇవ్వడం పట్లే తాను ఆసక్తి కనబరుస్తానని ఆల్ట్‌మన్ చెప్పుకొచ్చారు. గూగుల్‌తో పోటీ పడటం తనకు విసుగు తెప్పిస్తుందని లెక్స్ ఫ్రైడ్మన్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్ ఆధిపత్యాన్ని ఓపెన్ఏఐ నిలువరిస్తుందా అని ప్రశ్నించగా గూగుల్ కంటే మెరుగైన సెర్చింజన్‌తో ఓపెన్ఏఐ ముందుకొస్తే అప్పుడు ప్రజలు మెరుగైన ఉత్పత్తినే వాడతారని బదులిచ్చారు.
గూగుల్ కంటే మెరుగైన సెర్చింజన్ కోసం చాలా మంది ప్రయత్నించారని, కానీ ఇది ఓ కఠిన సాంకేతిక సమస్య, కఠిన బ్రాండింగ్ సమస్య, ఎకో సిస్టం సమస్యని పేర్కొన్నారు. అయినా గూగుల్‌కు మరో కాపీ ప్రపంచానికి అవసరమని తాను అనుకోవడం లేదని చెప్పారు. తాను చాట్‌జీపీటీతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సమాచారం చేరవేసేందుకే ప్రాధాన్యత ఇస్తానని ఆల్ట్‌మన్ చెప్పారు.
Read More :
Komatireddy Venkatreddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకుల ఆగ్రహం