Rupee | ముంబై, జూలై 15: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. సోమవారం ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 83.61కి పడిపోయింది. గత శుక్రవారం ముగింపుతో చూస్తే 10 పైసలు తగ్గింది. ఒకానొక దశలో 83.62 స్థాయికి నష్టపోయింది. అయితే తిరిగి స్వల్పంగా కోలుకున్నది.
ద్రవ్యోల్బణం దెబ్బ
దేశీయంగా విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. రూపాయిని ప్రభావితం చేస్తున్నట్టు బీఎన్పీ పరిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్‌లో రిసెర్చ్ అనలిస్ట్‌గా ఉన్న అనుజ్ చౌధరి విశ్లేషించారు. ఈ క్రమంలోనే భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో ముగిసినా.. ఆ ఉత్సాహాన్ని అందుకోలేకపోయినట్టు చెప్తున్నారు.