Rupee Vs Dollar | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి నిలువలేనంటున్నది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూ.82.68 వద్ద మొదలై రూ.82.69కి పడిపోయింది. ఇది సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టస్థాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నాలుగు పైసల నష్టంతో రూ.82.34 వద్ద స్థిర పడింది. ఆరు కరెన్సీల ఇండెక్స్‌లో డాలర్ 0.23 శాతం లాభపడి 113.05కి చేరుకోవడంతో రూపాయి పతనమైందని తెలుస్తున్నది.
ద్రవ్య లభ్యత పరిస్థితులు కఠినం కావడంతోపాటు ఇన్వెస్టర్లలో బలహీన సెంటిమెంట్ల మధ్య రూపాయి విలవిల్లాడుతున్నది. రూపాయి ప్రారంభ నష్టాలను నిలువరించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుని బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయించడంతో ముగింపు దశలో నాలుగు పైసల నష్టానికి పరిమితమైందని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టిన క్రూడాయిల్ ధర.. రూపాయికి మద్దతుగా నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధర 0.71 శాతం తగ్గి బ్యారెల్‌పై 97.22 డాలర్ల వద్ద నిలిచింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూపాయి 13 పైసల పతనంతో రూ.82.30 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 200.18 పాయింట్లు పతనమై 57,991.11 పాయింట్ల వద్ద స్థిర పడగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 73.65 శాతం నష్టంతో 17,241 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,250.77 కోట్ల విలువైన షేర్లకు విక్రయించారు.