మళ్లీ 83 ఎగువకు..
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 33 పైసలు పడిపోయింది. దీంతో కీలకమైన 83 స్థాయిని మరోమారు దాటి దేశీయ కరెన్సీ క్షీణించినైట్టెంది. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక ముడి చమురు ధరలు, అమెరికా డాలర్లకు ఫారెక్స్ మార్కెట్లో పెరిగిన డిమాండ్ మధ్య.. రూపాయి బలహీనపడుతున్నది.
- ఒక్కరోజే 33 పైసలు క్షీణించిన రూపాయి మారకం విలువ
- డాలర్‌తో పోల్చితే వెలవెలబోతున్న దేశీయ కరెన్సీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 33 పైసలు పడిపోయింది. దీంతో కీలకమైన 83 స్థాయిని మరోమారు దాటి దేశీయ కరెన్సీ క్షీణించినైట్టెంది. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక ముడి చమురు ధరలు, అమెరికా డాలర్లకు ఫారెక్స్ మార్కెట్లో పెరిగిన డిమాండ్ మధ్య.. రూపాయి బలహీనపడుతున్నది.
ఈ క్రమంలోనే 83.04 వద్ద నిలిచింది. సోమవారం కూడా 9 పైసలు దిగజారిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు 14 నుంచి డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83 స్థాయిని దాటడం ఇది ఐదోసారి. ‘డాలర్లకు వ్యక్తమవుతున్న డిమాండ్‌కుతోడు నిరాశాజనక భారతీయ స్థూల ఆర్థిక గణాంకాలు సైతం రూపాయి పతనానికి దారితీస్తున్నాయి’ అని బీఎన్పీ పరిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్ రిసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌధరీ అన్నారు. గత నెలలో దేశీయ సేవా రంగ కార్యకలాపాలు 60.1 స్థాయికే పరిమితమయ్యాయి. జూలైలో ఇది 62.3గా ఉన్నది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే రూపాయి నష్టాలు మొదలయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఇవి పెరుగుతూపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా రుపీని దెబ్బతీశాయి. కాగా, డాలర్ ముందు నిలువలేకపోతున్న రూపాయిని బలపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగవచ్చన్న అభిప్రాయాన్ని చౌధరీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

