ముంబై, సెప్టెంబర్ 1: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదొడుకుల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 88.10 వద్దకు దిగజారింది. గతంతో పోల్చితే 1 పైసా తగ్గగా.. శుక్రవారం నాటి రికార్డు కనిష్ఠ స్థాయి 88.09ని దాటిపోయినైట్టెంది. కాగా, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇక గత శుక్రవారం ఇంట్రా-డేలో డాలర్‌తో చూస్తే రూపీ వాల్యూ ఏకంగా 88.33 స్థాయికి క్షీణించిన విషయం తెలిసిందే. అయితే రూపాయి విలువ పడిపోయినకొద్దీ దేశీయ దిగుమతులు మరింత భారం అవుతాయి.