కస్టమర్లూ.. ఆ రోజు ఆర్టీజీఎస్ సేవలుండవ్..!
ఆర్టీజీఎస్ సేవలుండవ్| వచ్చే ఆదివారం ఆర్టీజీఎస్ సేవలు 14 గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ సంగతి స్వయంగా ఆర్బీఐ ...........

ముంబై: అసలే బ్యాంకులకు వివిధ పండుగలు, ఇతర కారణాల వల్ల ఏప్రిల్‌లో సెలవులే సెలవులు. ఇక మధ్యలో సాంకేతిక అంతరాయంతో సేవలు అందుబాటులో ఉండవంటే వినియోగదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.. ఎందుకంటే ఈ నెల 18వ తేదీన అంటే వచ్చే ఆదివారం ఆర్టీజీఎస్ సేవలు 14 గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ సంగతి స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది.
సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 18వ తేదీన ఆర్టీజీఎస్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ నెల 17వ తేదీన బ్యాంకుల్లో బిజినెస్ లావాదేవీలు ముగిసినప్పటి నుంచి ఆర్టీజీఎస్ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్టీజీఎస్ సేవల్లో డిజాస్టర్ రికవరీ టైమ్ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని వెల్లడించింది.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్టీఎఫ్టీ) వ్యవస్థలో మాత్రం సేవలు వినియోగదారులకు కొనసాగుతాయి.
కనుక సభ్య బ్యాంకులు తమ శాఖల్లోని ఖాతాదారులకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండబోవని.. చెల్లింపులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించాలని ఆర్బీఐ సూచించింది.
ఇవి కూడా చదవండి:
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా, నిక్
సెకండ్ వేవ్.. ధారావి మళ్లీ విజేతగా నిలుస్తుందా ?
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్‌లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.40వేల తగ్గింపు
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

