SBI Small Cap Fund | ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో నిధులు మదుపు చేయడం వల్ల రిస్క్ తక్కువ. మ్యూచువల్ ఫండ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఒకే విధమైన రిటర్న్స్ రావు. కొన్ని ఫండ్స్ అద్భుతమైన లాభాలిస్తుంటాయి. అటువంటి ఫండ్స్‌లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి. `ఎస్బీఐ స్మాల్ క్యాప్` ఫండ్‌లో ప్రతి నెలా రూ.5000 మదుపు చేశారనుకోండి. పదేండ్ల తర్వాత రూ.29 లక్షల రిటర్న్స్ వస్తాయి. అలా కాకుండా, ఒకేసారి రూ. లక్ష మదుపు చేస్తే రూ.10 లక్షలకు పైగా రిటర్న్స్ పొందొచ్చు.
ఈ పథకంలో గత మూడేండ్లలో ఎస్బీఐ స్మాల్ క్యాప్‌లో రెగ్యులర్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు 32.89 శాతం రిటర్న్స్ పొందారు. డైరెక్ట్ ప్లాన్ కింద పెట్టుబడి పెట్టిన వారికి 34.37 శాతం లాభాలు వచ్చాయి. ఒకేసారి భారీమొత్తంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.1.4 లక్షలు వచ్చాయి. గత పదేండ్లలో ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు 26.28 శాతం రిటర్న్స్ వచ్చాయి.
కాగా, 2009లో మార్కెట్లోకి వచ్చిన ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ (అసెట్స్ అండర్ మేనేజ్మెంట్-ఏయూఎం) విలువ రూ.14,044 కోట్లు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ వెబ్సైట్ ప్రకారం వార్షిక రిటర్న్స్ 26.76 శాతం, రెగ్యులర్ ప్లాన్ కింద ఇన్వెస్ట్‌మెంట్‌పై మదుపర్లకు 20.65 శాతం బెనిఫిట్లు వచ్చాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించే వారు ముందుగా నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.